కుల గణనపై కమిషన్ ఏర్పాటు భేష్
మంత్రి శ్రీధర్ బాబుకు కృష్ణయ్య కంగ్రాట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన కార్యక్రమాన్ని అభినందిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులతో పాటు కుల సంఘాల మేధావులతో బోయిన్ పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ నవంబర్ 5న సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్బంగా వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు సెక్రెటరియేట్ లోని వారి చాంబర్ లో జిల్లా ఎంపీ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నేతలతో సమిక్షా సమావేశాన్ని నిర్వహించారు.
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు. బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి , ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుండడం అభినందనీయం అన్నారు.
న్యాయ పరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా హైకోర్టు సూచనల మేరకు డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఎల్బీనగర్ నుంచి భారీగా జన సమీకరణ చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా బీసీ కులగరణ అంశంపై డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య శ్రీధర్ బాబు పేషీకి వచ్చి అభినందనలు తెలిపారు .