ఏపీలో నూతన క్రీడా విధానం – సీఎం
క్రీడా రంగంపై చంద్రబాబు సమీక్ష
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నూతన క్రీడా విధానంపై సీఎం సమీక్షించారు. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనే పేరుతో క్రీడా పాలసీని ప్రత్యేకంగా రూపొందించారు .
ఇదిలా ఉండగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పలు కీలక సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఈ సందర్బంగా ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు.
ఒలింపిక్స్, ఏషియన్స్ గేమ్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదన చేశారు సీఎం. సమగ్ర క్రీడా విధానంపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.
రాబోయే రోజుల్లో క్రీడా రంగంలో ఏపీ టాప్ లో ఉండాలని స్పష్టం చేశారు. భారీ ఎత్తున నిధులను కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.