ఏపీలో విధ్వంసకర పాలన
నిప్పులు చెరిగిన చంద్రబాబు
నెల్లూరు జిల్లా – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో జరిగిన రా కదలిరా సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు చంద్రబాబు .
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోసానికి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా జగన్ రెడ్డి పాలన మారిందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను అన్నింటిని నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు టీడీపీ చీఫ్.
ఇకనైనా ప్రజలు మేల్కోవాలని లేక పోతే రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళుతుందన్నారు. ఓటు అన్నది విలువైనదని, దానిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించారని, అధికారంలోకి వచ్చారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.