NEWSNATIONAL

ఒడిశా స‌ర్కార్ కూలిపోయే ఛాన్స్ – ఎంపీ

Share it with your family & friends

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మున్నా ఖాన్

ఒడిశా – బిజూ జ‌న‌తా ద‌ళ్ పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు మున్నా ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒడిశా రాష్ట్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఏ క్ష‌ణ‌మైనా కూలిపోయేందుకు సిద్దంగా ఉంద‌ని జోష్యం చెప్పారు. ఎందుకంటే స‌ర్కార్ కు చెందిన 14 మంది శాస‌న స‌భ్యులు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని ప్ర‌క‌టించారు.

మంగ‌ళ‌వారం ఎంపీ మున్నా ఖాన్ మీడియాతో మాట్లాడారు. త‌న‌తో ట‌చ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు కూడా తాను ఇప్పుడే చెప్ప‌గ‌ల‌న‌ని, కానీ రూల్స్ కు విరుద్దం కాబ‌ట్టి తాను ప్ర‌క‌టించ‌డం లేద‌న్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలి పోతుంద‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ఎంపీ.

ఎలాగైనా స‌రే బీజేపీ ప్ర‌భుత్వాన్ని కూల్చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాల‌లో న్యాయ బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వాల‌ను మోడీ స‌ర్కార్ టార్గెట్ చేయ‌డం, వేధింపుల‌కు గురి చేయ‌డం, కేసులు న‌మోదు చేయ‌డం చేస్తోంద‌న్నారు. దొడ్డి దారిన ప్రభుత్వాల‌ను ఏర్పాటు చేయ‌డం ఆ పార్టీ ఓ ప‌నిగా పెట్టుకుంద‌న్నారు.

ప్ర‌స్తుతం ఒక‌వేళ ఒడిశాలో ఎన్నిక‌లు జ‌రిగితే బీజేడీకి క‌నీసం 100 సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు ఎంపీ మున్నా ఖాన్.