NEWSANDHRA PRADESH

నేర‌స్థులు అప్ డేట్ అవుతున్నారు – హోం మంత్రి

Share it with your family & friends

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అనిత వంగ‌ల‌పూడి

అనంత‌పురం జిల్లా – ఏపీ రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆమె అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో ఆమె మాట్లాడారు. మ‌హిళ‌లు , చిన్నారుల‌పై రోజు రోజుకు అఘాయిత్యాలు, దారుణ‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హోం మంత్రి.

ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ర‌కాలైన ఉన్మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని వాపోయారు. విచిత్రం ఏమిటంటే టెక్నాల‌జీ పెరిగినా ఇంకా నేర‌స్థులు త‌మ‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్నార‌ని అన్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఎప్ప‌టిక‌ప్పుడు వారంతా అప్ డేట్ అవుతున్నార‌ని, త‌మ‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నారంటూ చెప్పారు అనిత వంగ‌ల‌పూడి.

హ‌త్య‌లు, అత్యాచారాల‌కు పాల్ప‌డే వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు. జిల్లాకో సోష‌ల్ మీడియా పీఎస్ ను ఏర్పాటు చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు అనిత వంగ‌ల‌పూడి. అప్పాను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉందన్నారు. లా ఆర్డ‌ర్ ను మ‌రింత ప‌టిష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు హోం శాఖ మంత్రి.