సుప్రీంకోర్టు దేశానికి రక్షణ కవచం
హక్కులను కాపాడటంలో కీలక పాత్ర
న్యూఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడటంలో , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలకమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసలు కురిపించారు.
ఇటీవలే ఆయన అయోధ్య లోని రామ జన్మ భూమికి సంబంధించి రామాలయం పునః ప్రారంభోత్స కార్యక్రమంలో కూడా కితాబు ఇచ్చారు. 500 ఏళ్లుగా నిరీక్షిస్తున్న హిందూ బంధువులకు తీపి కబురు చెప్పేందుకు కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పేనని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
ఇదిలా ఉండగా ఆదివారం సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు ప్రధాన మంత్రి. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ సుప్రీంకోర్టుకు 75 ఏళ్లు నిండాయని ,ఇది చారిత్రాత్మకమైన సన్నివేశమని పేర్కొన్నారు. తాను ఉత్సవాలను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ ఏడు దశాబ్దాల కాలంలో సర్వోన్నత న్యాయ స్థానం ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పులను ఇచ్చిందని ప్రశంసల జల్లులు కురిపించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.