సర్వార్ నిర్వాకం రియల్ ఎస్టేట్ కు శాపం
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి శాపంగా మారిందని వాపోయారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందన్నారు.
తమ బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ కంటే ఎక్కువగా స్పీడ్ గా ఉండేదన్నారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చేసరికి పూర్తిగా కుదేలై పోయిందని వాపోయారు. ఈ ఒక్క రంగం నిర్వీర్యం కావడంతో దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.
హైడ్రా దూకుడు, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుండడంతో పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు కేటీఆర్.
కేసీఆర్ పాలనలో రియల్ బూమ్ కొనసాగింది ఎట్ల.. కాంగ్రెస్ పాలనలో ఆగిపోవడం ఎట్లా అని ప్రశ్నించారు . దీనికి ప్రధాన కారణం కేవలం పరిపాలన దక్షత లోపం..విజన్ లేని పాలనా విధానం తప్పా మరోటి కాదన్నారు.
తెలంగాణ ఆదాయానికి జీవధారగా మారి పోయిన రియల్ రంగంపై హైడ్రా వేటు వేసిందన్నారు. ముందు చూపు లేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడిందన్నారు కేటీఆర్.