ఏపీలో గాడి తప్పిన పాలన – ఆర్కే రోజా
చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు.
డిప్యూటీ సీఎం ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించ లేదన్నారు. దీనిపై అనిత వంగలపూడి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఆర్కే రోజా సెల్వమణి.
పాలనా పరంగా ఏపీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీ హోం మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందిందని, వెంటనే ఆ కీలకమైన పదవి నుంచి అనిత వంగలపూడి తప్పు కోవాలని అన్నారు ఆర్కే రోజా సెల్వమణి. విచిత్రం ఏమిటంటే మీకు పాలన నిర్వహించడం చేతకాక..పోలీసులను తిడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. వారు రేయింబవళ్లు లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు మాజీ మంత్రి.