NEWSANDHRA PRADESH

ప‌రిటాల కుటుంబానికి వంద‌నం – అనిత

Share it with your family & friends

ప‌రిటాల సునీత చూపించిన ప్రేమ గొప్ప‌ది

అనంత‌పురం జిల్లా – ఏపీ రాష్ట్ర హోం శాఖ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌స్తుతం అధికారిక ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా అనంత‌పురం జిల్లా అంటేనే ముందుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. ఇక్క‌డ దివంగ‌త నాయ‌కుడు, పేద‌ల పెన్నిధి , ప్ర‌జా నాయ‌కుడు ప‌రిటాల ర‌వీంద్ర గుర్తుకు వ‌స్తాడ‌ని గుర్తు చేసుకున్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.

ఆమె స్వ‌యంగా వెంక‌టాపురం గ్రామానికి వెళ్లారు. అక్క‌డే ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీతను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అనిత వంగ‌ల‌పూడికి గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు ప‌రిటాల కుటుంబం. సునీత‌తో పాటు ధ‌ర్మ‌వ‌రం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ప‌రిటాల శ్రీ‌రామ్ కూడా ఉన్నారు.

అనిత వంగ‌ల‌పూడికి శాలువా క‌ప్పి , స‌న్మానించారు ప‌రిటాల సునీత‌. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. ప‌రిటాల కుటుంబం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. త‌న ప‌ట్ల సోద‌రి సునీత క‌న‌బ‌ర్చిన ఆప్యాయ‌త‌ను, అనురాగాన్ని తాను మ‌రిచి పోలేన‌ని అన్నారు.

ఆప్యాయకరమైన పలకరింపు, స్వచ్ఛమైన మనసుతో ఆమె చూపించే ప్రేమ ప్రత్యేకమైనవి. ఇవాళ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా పరిటాల సునీత నివాసంలో ఆమెను కలవడం మరచి పోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు.