అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ
కమలా హారీస్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలకమైన తీర్పు ఎలా వస్తుందనే దానిపై యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అమెరికన్లు ఓటు వేసేందుకు వేచి ఉన్నారు. దేశానికి సంబంధించి 47వ ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్నారు. 186 మిలియన్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది, ఇద్దరు అభ్యర్థులు అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. చివరకు ఎవరు గెలుస్తారనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది.
చాలా మంది రాజకీయ పరిశీలకులు 47వఅధ్యక్షుడి కోసం అనూహ్యమైన పోటీని దశాబ్దాలలో అత్యంత పర్యవసానంగా ప్రకటించారు, అయితే ట్రంప్ అధ్యక్షుడిగా దేశం భవిష్యత్తు కోసం ఒక భయంకరమైన చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.
బైడెన్ పాలనలో అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్. అయితే నియంతృత్వానికి పరాకాష్ట ట్రంప్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.