NEWSTELANGANA

దేశాభివృద్దిలో బిల్డ‌ర్స్ పాత్ర కీల‌కం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బిల్డ‌ర్ల గురించి ప్ర‌శంస‌లు కురిపించారు. దేశాన్ని అభివృద్ది ప‌థంలో న‌డిపించ‌డంలో బిల్డ‌ర్లు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం మీ అంద‌రికీ మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఎవ‌రైనా త‌న వ‌ద్ద‌కు రావ‌చ్చ‌ని, మీకు ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే వెంట‌నే ప‌రిష్కారం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా బిల్డ‌ర్స్ క‌న్వెన్ష‌న్ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

ఆర్థికంగా మీరు బ‌ల‌ప‌డితే రాష్ట్రం అభివృద్ది చెందుతుంద‌ని, ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు సీఎం. ప్ర‌భుత్వం బిల్డ‌ర్ల‌ను అక్కున చేర్చుకుంటుంద‌న్నారు. ఒక‌ప్పుడు గొలుసు క‌ట్టు చెరువుల‌తో హైద‌రాబాద్ లేక్ సిటీగా పేరు పొందింద‌ని చెప్పారు.

ఈ భాగ్య న‌గ‌రానికి మూసీ న‌ది గొప్ప వ‌న‌రు అని పేర్కొన్నారు. దీనిని పున‌రుద్ద‌రించేందుకు త‌మ స‌ర్కార్ న‌డుం బిగించింద‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ మెగా మాస్ట‌ర్ ప్లాన్ 2050ని తీసుకు రాబోతున్నామ‌ని అన్నారు. ఇందుకు మీ స‌హ‌కారం కావాల‌ని కోరారు.