NEWSANDHRA PRADESH

పోలీస్ శాఖ‌లో మ‌హిళ‌ల పాత్ర భేష్

Share it with your family & friends

ప్రాతినిధ్యం పెరగ‌డం అభినంద‌నీయం

అనంత‌పురం జిల్లా – ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖా మంత్రి అనిత వంగ‌ల‌పూడి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు.

జిల్లాలో మంత్రి ప‌ర్య‌టించారు. అంత‌కు ముందు ఆమె రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌ను వెంక‌టాపురం గ్రామంలో క‌లుసుకున్నారు. అనంత‌రం అనంత‌పురంలో జరిగిన డీఎస్పీల ట్రైనింగ్ లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వించదగ్గ విషయమ‌న్నారు.

ఆల్ రౌండ్ ప్రతిభలో ఇద్దరు మహిళా డీఎస్పీలు సత్తా చూపడం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు అనిత వంగ‌ల‌పూడి. వారికి త‌న‌ తరపున ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు మంత్రి.

మహిళా పోలీసుల సంఖ్య పెరగడం బాగుంద‌న్నారు. పోలీస్ స్టేషన్లలో మహిళలు అందుబాటులో ఉన్నట్లయితే స్త్రీలు, ఆడపిల్లలు తమ ఇబ్బందులను నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదు చేసేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌.