సరస్వతి పవర్ భూములపై విచారణ
ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల సంచలన ప్రకటన చేశారు. ఆయన గత వైసీపీ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న భూముల వ్యవహారానికి సంబంధించి స్పందించారు. మంగళవారం సరస్వతి పవర్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల అప్పగింతకు సంబంధించి తమ ప్రభుత్వం విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
వేమవరంలో 710.6 ఎకరాలు, జామయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగెడ గ్రామంలో 107.36 ఎకరాలు. మొత్తం రైతాంగం దగ్గర నుండి 1384 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. పట్టా భూములు 1083 ఎకరాలు వీట్లో సగం పైగా బాంబులేసి, భయపెట్టి లాక్కున్నవేనని అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం వైసిపి నాయకుడు ఆనాడు భూ యజమానులకు తమ బిడ్డల్ని చదివిస్తాం, ఉద్యోగాలిస్తాం అని నమ్మించి భూములు రాయించు కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.
కూటమి ప్రభుత్వం గనుక రాక పోయి ఉండి ఉంటే వైసీపీ నేతలు మొత్తం భూములను ప్రజలకు లేకుండా చేసే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.