జగనన్న గీత గీస్తే జవదాటను
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అమరావతి – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గీత గీస్తే జవ దాటే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి దాకా శాసన సభలో తిట్టానని, రేపటి రోజున పార్లమెంట్ లో కూడా తన గొంతు వినిపిస్తానని అన్నారు.
తన గెలుపును ఎవరూ అడ్డు కోలేరని పేర్కొన్నారు. జగన్ రెడ్డి మాటే శిరోధార్యమని, ఆయనను కాదని తాను ఏ పనీ చేయనని చెప్పారు. కొందరు లేనిపోని కామెంట్స్ చేస్తుంటారని వాటిని తాను పట్టించు కోనని అన్నారు. నిన్న తనను అభిమానించే ప్రజలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని ఈసారి ఎంపీగా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క ఏపీలోనే అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. లబ్ది పొందిన వారంతా తమను అక్కున చేర్చుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు.