అమెరికా అధ్యక్షుడిని నేనే – ట్రంప్
నా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు డొనాల్డ్ ట్రంప్ దూసుకు పోతుండగా కమలా హారీస్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడును ప్రదర్శిస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తానని, ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం కోల్పోకుండా కాపాడుతానని, ఆర్థిక మాంద్యం నుంచి రక్షిస్తానని ప్రకటించారు. అంతే కాదు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెద్ద ఎత్తున వేస్తున్న పన్నులను తొలగిస్తానని, కార్మికులు, చిరు వ్యాపారులకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటానని ఓటర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత బైడెన్ సర్కార్ వైఫల్యాలను ఎక్కువగా ప్రస్తావించారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే లా ఉంది. మొత్తంగా పూర్తి నమ్మకంతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. తాను గెలిచి తీరుతానని ప్రకటించారు. తాను 47వ ప్రెసిడెంట్ కావడం ఖాయమన్నారు.