సీఎంగా కొలువు తీరిన నితీశ్ కుమార్
బీహార్ చరిత్రలో 9వ సారి సీఎంగా
బీహార్ – బీహార్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. ఆయన వరుసగా 9వ సారి ప్రమాణం చేయడం . ఇది ఓ రికార్డు. ఉదయం నత పదవికి రాజీనామా చేశారు. తిరిగి సాయంత్రం సీఎంగా కొలువు తీరారు. కాంగ్రెస్ సంకీర్ణానికి తెర దించారు. తిరిగి మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎన్డీయే కూటమితో జత కట్టారు. అంతకు ముందు ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ కొంత కాలం మాత్రమే ఉన్నారు. చివరకు డోంట్ కేర్ అంటూ ప్రకటించారు.
ఇది ఒక రకంగా ప్రతిపక్షాల కూటమికి కోలుకోలేని షాక్. ఆర్జేడీ పార్టీ మద్దతును ఉపసంహరించు కుంటూ రాజీనామా చేశారు. తన లేఖను గవర్నర్ కు అందజేశారు. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తిరిగి బీజేపీ మద్దతు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెరవెనుక అమిత్ షా నడిపిన మంత్రాంగం వర్కవుట్ అయ్యింది. బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లను కైవసం చేసుకోవాలని బిగ్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు సక్సెస్ అయ్యింది. మొత్తంగా ఇవాళ ముచ్చటగా తొమ్మిదో సారి సీఎంగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్.