NEWSANDHRA PRADESH

బాబు మ‌ద్ద‌తును మ‌రిచి పోలేం – మంద‌కృష్ణ

Share it with your family & friends

రిజ‌ర్వేష‌న్ కోసం ముందు నుంచి మ‌ద్ద‌తు

అమ‌రావ‌తి – మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ మ‌ర్యాద పూర్వ‌కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌నకు పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. త‌న‌కు ముందు నుంచి మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చార‌ని స్ప‌ష్టం చేశారు మంద‌కృష్ణ మాదిగ‌.

గ‌త కొన్నేళ్లుగా ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చారు. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, స‌మ్మెలు చేప‌ట్టారు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు మంద‌కృష్ణ మాదిగ‌. ఇదే సమ‌యంలో అన్ని పార్టీల‌ను, వివిధ సంఘాల‌ను , మేధావుల‌ను క‌లుసుకున్నారు.

త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. చివ‌ర‌కు వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న‌ప్ప‌టికీ హిందూత్వ వాదంతో ముందుకు సాగుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో ఆయ‌న కొన‌సాగుతూ వ‌చ్చారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. మాదిగ‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని స‌భా సాక్షిగా ప్ర‌క‌టించారు. దీంతో క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు మంద‌కృష్ణ మాదిగ‌.

కాగా అంద‌రి కంటే ముందు నుంచీ టీడీపీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారని తెలిపారు ఎంఆర్పీఎస్ చీఫ్‌.