‘పొంగులేటి’పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
నువ్వు ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలియదు
అమరావతి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏకి పారేశారు. తమపై పదే పదే అవాకులు చెవాకులు పేలడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పొంగులేటి పదే పదే తనతో పాటు తన బావమరిది హరీశ్ రావు, తండ్రి కేసీఆర్ జైలుకు వెళతారని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇలాగేనా మాట్లాడేది అని నిలదీశారు కేటీఆర్.
వాళ్లు వీళ్లు జైలుకు పోతారని అనడం కాదు ముందు నువ్వు ఎప్పుడు జైలుకి పోతావో చూస్కో అని అన్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి భవితవ్యం గురించి బాంబు పేల్చారని , త్వరలోనే ఆయనను మారుస్తారంటూ జోష్యం చెప్పారని పేర్కొన్నారు.
ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరంతా రేవంత్ రెడ్డి ఆడించినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అని , ఎందుకంటే ఒచ్చేది మా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు కేటీఆర్.