అన్నామలై అత్యంత ప్రమాదకరం
హిందూ ఎడిటర్ ఎన్ . రామ్ కామెంట్
తమిళనాడు – ప్రముఖ దినపత్రిక ది హిందూ ఎడిటర్ ఎన్. రామ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలైపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అన్నామలై మామూలోడు కాదని, తమిళులను కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నామలై ప్రవర్తిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమని, ఇది పూర్తిగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని హెచ్చరించారు. ఇకనైనా తమిళులతో పాటు దేశ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు ఎన్. రామ్.
మొగ్గలోనే అన్నామలైని తుంచేయాలని, ఒకవేళ అతడిని ప్రోత్సహించడం మొదలు పెడితే ఇక ఆపడం ఎవరి తరం కాదన్నారు . అన్నామలైకి ఏ ఒక్క తమిళ పత్రిక కానీ, మీడియా కానీ ఎలాంటి మద్దతు ఇవ్వరాదని సూచించారు ది హిందూ ఎడిటర్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలోనే పేరు పొందిన ఎడిటర్ రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింప చేసేలా ఉన్నాయి.