కీలక అంశాలపై సీఎం సమీక్ష
ఐటీ..డ్రోన్..టెక్నాలజీపై కూడా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ గురించి కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ఉదయం 11 గంటలకు ఈ రాష్ట్ర సమావేశం ప్రారంభమైంది. ప్రధాన అంశాలపై చర్చకు వచ్చాయి. ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు అయ్యాయనే దానిపై కూడా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మరోసారి శాసన సభ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ 11న ప్రారంభం కానుండడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. పూర్తి స్థాయి బడ్జెట్ పైన కేబినెట్ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి రాష్ట్ర రెవిన్యూ , శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ కసరత్తు చేశారు.