NEWSANDHRA PRADESH

నారా లోకేష్ కు మంత్రుల అభినంద‌న

Share it with your family & friends

అమెరికా టూర్ లో ప‌లు కంపెనీల‌తో భేటీ

అమ‌రావ‌తి – అమెరికా ప‌ర్య‌ట‌న దిగ్విజ‌యంగా ముగించుకుని అమ‌రావ‌తికి విచ్చేశారు ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్. బుధ‌వారం స‌చివాల‌యంలో కీల‌క‌మైన మంత్రివ‌ర్గం స‌మావేశం జ‌రిగింది. ఈ కీల‌క భేటీకి ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త వ‌హించారు.

అంత‌కు ముందు రాష్ట్ర కేబినెట్ కు చెందిన ప‌లువురు కీల‌క మంత్రులు విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని స్వ‌స్థ‌లానికి విచ్చేసిన నారా లోకేష్ ను ఆయ‌న నివాసంలో క‌లుసుకుని అభినందించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాచ‌ర‌ని కొనియాడారు. ఏకంగా ఈ యుఎస్ టూర్ 100 కు పైగా కంపెనీల సీఈవోలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ల‌ను క‌లుసుకున్నారు.

త‌మ రాష్ట్రానికి రావాల్సిందిగా, పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా కోరారు నారా లోకేష్. అంతే కాదు మిట్ట‌ల్ కు చెందిన స్టీల్ కంపెనీ ఏకంగా రూ. 1,74,000 కోట్ల ఖ‌ర్చుతో అన‌కాప‌ల్లి జిల్లాల‌లో స్టీల్ క‌ర్మాగారాన్ని నెల‌కొల్ప‌నుంది. ఈ మేర‌కు కంపెనీ సీఈవో ఆదిత్యా మిట్ట‌ల్ తో మాట్లాడారు నారా లోకేష్.

ఇక నారా లోకేష్ ను క‌లిసి అభినందించిన వారిలో మంత్రులు నారాయ‌ణ‌, అచ్చెన్నాయుడు, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అనిత వంగ‌ల‌పూడి, నిమ్మ‌ల రామా నాయుడు , త‌దిత‌రులు ఉన్నారు.