NEWSNATIONAL

ట్రంప్ విజ‌యం మోడీ సంతోషం

Share it with your family & friends

మిత్ర‌మా నీ గెలుపు అద్భుతం

న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ సంతోషం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అమెరికా దేశ ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం సాధించారు రిప‌బ్లిక‌న్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న ఆ దేశానికి 47వ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

రాజ‌కీయంగా చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. త‌న‌కు అత్యంత ఆత్మీయుడు, స‌హ‌చ‌రుడు అంటూ పేర్కొన్నారు. హృద‌య పూర్వ‌కంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

మీ చారిత్రాత్మక ఎన్నికల విజయంపై. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి తాను ఎదురు చూస్తున్నాని పేర్కొన్నారు మోడీ. కలిసి, మన ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని చేద్దామ‌ని పిలుపునిచ్చారు డొనాల్డ్ ట్రంప్ కు.