NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ చాప్ట‌ర్ ఇక‌ క్లోజ్ – లోకేష్

Share it with your family & friends

వైసీపీకి అంత సీన్ లేదు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చాప్ట‌ర్ ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే టీడీపీ, జ‌న‌సేన పార్టీల కూట‌మి ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. జ‌నం తాము మోసానికి గురైన‌ట్లు గుర్తించార‌ని, ఇక ఘోర‌మైన ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు నారా లోకేష్.

ఇదిలా ఉండ‌గా నారా లోకేష్ స‌మ‌క్షంలో వైసీపీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు 500కు పైగా కుటుంబాలు టీడీపీ కండువాను క‌ప్పున్నాయి. వారంద‌రినీ పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్. స‌మిష్టిగా ప‌ని చేసి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు.

అవినీతి , అక్ర‌మాల‌కు ఏపీ కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు నారా లోకేష్. ఇక జగ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. మంగ‌ళ‌గిరిలో త‌న విజ‌యం ఖాయ‌మ‌ని, త‌న‌ను అడ్డుకునే శ‌క్తి వైసీపీకి లేద‌న్నారు.