ఓడి పోయినా పోరాడుతూనే ఉంటా
మాజీ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారీస్
అమెరికా – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పొందిన అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో ట్రంప్ కు అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు కమలా హారీస్.
ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నానని, దేశంలోని మహిళల హక్కుల కోసం, తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలందరికీ దక్కాల్సిన గౌరవం కోసం పోరాడతానని ప్రకటించారు.
ఇదే సమయంలో ఈ ఎన్నికలు జరిగిన తీరును తాను తప్పు పట్టడం లేదని, కానీ ఎన్నికల సందర్బంగా జరిగిన ప్రచారానికి ఆజ్యం పోసిన తీరును తాను అంగీకరించ బోనంటూ స్పష్టం చేశారు కమలా హారీస్. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హోవార్డ్ విశ్వ విద్యాలయంలో తన మద్దతుదారులతో కలిసి ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ఫలితాలను గౌరవించడం ప్రజాస్వామ్యాన్ని రాచరికం లేదా దౌర్జన్యం నుండి వేరు చేస్తుందని అన్నారు.
ఈ ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదు, మనం పోరాడినది కాదు, మనం ఓటు వేసినది కాదు, కానీ మనం ఎప్పటికీ వదులు కోనంత కాలం అమెరికా వాగ్దానాల వెలుగు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతుంది.