పతకాలు తీసుకొస్తే కాసుల పంట – సీఎం
భారీ నజరానా ప్రకటించిన చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కీలక మంత్రివర్గం సమావేశంలో ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా స్పోర్ట్స్ పాలసీని ఆమోదించింది ఏకగ్రీవంగా . ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు ఏశారు సీఎం.
రాష్ట్రం తరపున ఒలింపిక్స్ లో లేదా ఇతర క్రీడా రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబర్చినా లేదా పతకాలు సాధించినా భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ముందు నుంచీ క్రీడా విధానం పట్ల ఆసక్తితో ఉన్నారు. దేశంలోనే ఏపీ క్రీడా పరంగా నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో క్రీడా పాలసీని అద్భుతంగా తయారు చేయాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు స్పోర్ట్స్ పాలసీని రూపొందించారు. ఈ సందర్బంగా పతకాలు సాధించే వారికి నారా చంద్రబాబు నాయుడు నగదు పురస్కారాలను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఒలింపిక్స్ పోటీలలో బంగారు పతకం సాధిస్తే రూ. 7 కోట్లు , వెండి పతకం సాధిస్తే రూ. 5 కోట్లు, కాంస్య పతకం పొందితే రూ. 3 కోట్లు ప్రభుత్వ పరంగా ఇస్తామని ప్రకటించారు సీఎం. అంతే కాకుండా పాల్గొనే వారికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున అందజేస్తామన్నారు.
ఆసియా క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు పసిడి పతకం సాధిస్తే రూ. 4 కోట్లు, వెండి పతకం పొందితే రూ. 2 కోట్లు, కాంస్య పతకం దక్కించుకుంటే రూ. 1 కోటి చొప్పున ఇస్తామని, పాల్గొనే ప్రతి క్రీడాకారికి రూ. 10 లక్షలు అందజేస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.