శ్రీవారి అన్న ప్రసాదం మహా భాగ్యం – బీఆర్ నాయుడు
వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భోజనం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా కొలువు తీరిన బీఆర్ నాయుడు, తన కుటుంబంతో కలిసి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.
డిప్యూటీ ఈవో రాజేంద్ర అన్న ప్రసాదం కార్యాకలాపాలను చైర్మన్ కు వివరించారు. అన్న ప్రసాద భవనంలో ఒక రోజులో ఎంత మంది భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు, అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్న ప్రసాద భవనం పని చేసే వేళలు తదితర విషయాల గురించి సవివరంగా తెలియజేశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తన జీవితంలో మరిచి పోలేని పదవి దక్కిందన్నారు. ఇదంతా కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కృప , ఆశీర్వాదం వల్ల కలిగిందని తెలిపారు. ఇక నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు.