DEVOTIONAL

రంగ‌నాథుని గుడిలో దామోద‌ర‌

Share it with your family & friends

ద‌ర్శించుకున్న ఆరోగ్య మంత్రి
సంగారెడ్డి జిల్లా – రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలోని శ్రీ భూనీల స‌మేత శ్రీ రంగ‌నాథ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. కుటుంబ సమేతంగా హాజ‌రైన మంత్రికి ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ , పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఆల‌యంలో శ్రీ గోదా రంగ‌నాథ స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం కొన‌సాగుతోంది. ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. స్వామి వారికి పూజ‌లు నిర్వ‌హించారు. పూజారులు మంత్రిని, కుటుంబానికి ఆశీస్సులు అంద‌జేశారు.

అనంత‌రం స్వామి వారి చిత్ర ప‌టాన్ని, ప్ర‌సాదాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా ఆందోల్ లో కొలువై ఉన్న గోదా రంగ‌నాథుడిని ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని చెప్పారు.

ఆల‌య అభివృద్దికి త‌న వంతుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తాన‌ని మంత్రి హామీ ఇచ్చారు. భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచించారు.