ఏపీ సర్కార్ బేకార్
చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సర్కార్ బక్వాస్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని ధ్వజమెత్తారు .
త్వరలో జరిగే శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వైసీపీ కావాలని తమపై దుష్ప్రచారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
తాము వచ్చాక ఏపీ కష్టాలు తొలగి పోతాయని, గతంలో చెప్పిన విధంగానే అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ ఆరోపించారు.
ప్రజలు స్వచ్చందంగా తమకు మద్దతు తెలియ చేస్తున్నారని, దానిని తాము స్వాగతిస్తున్నామని, ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.