NEWSANDHRA PRADESH

పోలీసులు ట‌చ్ చేస్తే కాల్ చేయండి

Share it with your family & friends

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు జ‌గ‌న్ భ‌రోసా

అమ‌రావ‌తి – ఏపీలో పోలీసులు ఎవ‌రైనా ట‌చ్ చేసినా లేదా వేధింపుల‌కు గురి చేసినా లేదా కేసులు న‌మోదు చేయాల‌ని ప్ర‌య‌త్నం చేసినా వెంట‌నే వైసీపీ లీగ‌ల్ విభాగానికి ఫోన్ చేయాల‌ని పిలుపునిచ్చారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఈ మేర‌కు వైసీపీ ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కేవ‌లం ఒకే ఒక్క కాల్ చేయాల‌ని సూచించారు. ఏ పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా త‌మ‌కు సమాచారం ఇవ్వాల‌ని కోరారు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లీగ‌ల్ వ్య‌వ‌హారాలు చూస్తున్న పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు సెంట్ర‌ల్ ఆఫీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

ముగ్గురిని నియ‌మించార‌ని, వారికి సంబంధించిన ఫోన్ నెంబ‌ర్లు కూడా ఇందులో ఇవ్వ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ జె. సుద‌ర్శ‌న్ రెడ్డి కి సంబంధించి 9440284455 అనే ఫోన్ నెంబ‌ర్ లో , రాష్ట్ర మాదిగ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ కొమ్మూరి క‌న‌కారావుకు సంబంధించి 9963425526, రాష్ట్ర వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ఆర్గ‌నైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డికి సంబంధించి 9912205535 అనే నెంబ‌ర్ లో సంప్ర‌దించాల‌ని కోరారు.

కార్య‌క‌ర్త‌లు , నాయ‌కులు, అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.