NEWSANDHRA PRADESH

త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు

Share it with your family & friends

హెచ్చ‌రించిన ఏపీ డీజీపీ

అమ‌రావ‌తి – ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా ఏ పార్టీకి చెందిన వారైనా వ్య‌క్తిగ‌తంగా లేదా డ్యామేజ్ చేస్తూ ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌ప్పుడు వార్త‌లు పోస్ట్ చేస్తే ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇక నుంచి సోష‌ల్ మీడియా యాక్ట్ కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని చెప్పారు. సోమ‌వారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి పూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేందుకు గాను ప్ర‌త్యేకంగా 130 మంది పోలీసుల‌తో సోష‌ల్ ఈడియా సెంట‌ర్ ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ టీమ్ లో సాఫ్ట్ వేర్ స్పెష‌లిస్టుల‌ను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్ర‌తి జిల్లా హెడ్ క్వార్ట‌ర్ లో ఒక టీమ్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారానికి పాల్ప‌డ వ‌ద్ద‌ని సూచించారు.

ప్ర‌భుత్వ స‌హ‌కారంతో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో మెయిన్ సెంట‌ర్ ఉంటుంద‌న్నారు. ప్ర‌తి జిల్లాలోని హెడ్ క్వార్ట‌ర్ లో ఒక సీఐ, ఒక ఎస్ఐ , ఆరుగురు కానిస్టేబుల్స్ తో పాటు జిల్లా ఎస్పీకి అనుసంధానం చేస్తున్నామ‌ని చెప్పారు.