NEWSINTERNATIONAL

యుఎస్ సీఐఏ చీఫ్ గా కశ్య‌ప్ ప‌టేల్ ..?

Share it with your family & friends

హిందూ వాదికి డొనాల్డ్ ట్రంప్ ప్ర‌యారిటీ

అమెరికా – అమెరికా దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కంట్రోల్ చేసే కీల‌క‌మైన ప‌ద‌వి భార‌త దేశానికి చెందిన ప్ర‌వాస భార‌తీయుడు కశ్య‌ప్ ప‌టేల్ కు ద‌క్క‌నుందా. అవున‌నే అంటోంది ఆ దేశం. తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా కీల‌క‌మైన సీఐఏ చీఫ్ ప‌ద‌వి కశ్య‌ప్ ప‌టేల్ నే వ‌రించ‌నుంది. ఆయ‌న వైపే మొగ్గు చూపుతున్నారు ప్ర‌స్తుత కొత్తగా ఎన్నికైన అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.

ట్రంప్ త‌న తొలి ప‌ద‌వీ కాలంలో ర‌క్ష‌ణ‌, గూఢ‌చార వ‌ర్గాల్లో వివిధ ఉన్న‌త స్థాయి ల‌లో ప‌ని చేశారు క‌శ్య‌ప్ ప‌టేల్. సీఐఏ డైరెక్ట‌ర్ గా కొలువు తీర‌నున్నాడు. క‌శ్య‌ప్ ప‌టేల్ ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి క్రిస్టోఫ‌ర్ మిల్ల‌ర్ కు మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ప‌ని చేశాడు.

తొలిసారి అధ్య‌క్షుడిగా ఉన్న కాలంలో వివిధ ఉన్న‌త స్థాయి జాబ్స్ ల‌లో ప‌ని చేశారు. అంతే కాకుండా తీవ్ర‌వాద గ్రూపుల‌తో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌పై విచార‌ణ చేప‌ట్టారు. ట్రంప్ ఎజెండాను ప్ర‌చారం చేయ‌డంలో క‌శ్య‌ప్ ప‌టేల్ చురుకుగా పాల్గొన్నారు. ఉన్న‌త ర్యాంకింగ్ పోస్టుల‌లో ఎవ‌రెవ‌రిని నియ‌మించాల‌నే దానిపై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు ట్రంప్.

తూర్పు ఆఫ్రికా నుండి వ‌ల‌స వ‌చ్చిన భార‌తీయ పేరెంట్స్ కు ఫిబ్ర‌వ‌రి 25, 1980లో న్యూయార్క్ లో పుట్టారు క‌శ్య‌ప్ ప‌టేల్. గుజ‌రాత్ లోని వ‌డోద‌ర‌లో మూలాలు ఉన్నాయి. యూనివ‌ర్శిటీ లా కాలేజీలో ఇంట‌ర్నేష‌న‌ల్ లా చ‌దివాడు. 9 ఏళ్ల పాటు కోర్టుల‌లో వాదించాడు. సంక్లిష్ట‌మైన కేసుల‌ను వాదించాడు.

నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కి ప్రిన్సిపల్ డిప్యూటీగా నియమించబడ్డాడు.