వాలంటీర్లు వ్యవస్థలో లేరు – పవన్ కళ్యాణ్
సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించబడిన వాలంటీర్ వ్యవస్థ గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాలంటీర్లు ప్రస్తుత వ్యవస్థలో భాగం కావడం లేదన్నారు.
సర్పంచ్ సంఘాల నేతలతో గురువారం జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని పలువురు సర్పంచ్ లు కోరారు. వారు చేసిన వినతిపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం.
అయితే వారిని తొలగించడం అంటూ ఉండదని, ఆ వ్యవస్థను రద్దు చేయడం తగదన్నారు. కానీ పని చేస్తున్న వాలంటీర్లకు మేలు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. అయితే గత జగన్ రెడ్డి సర్కార్ వాలంటీర్లను నిట్ట నిలువునా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేసేందుకు వీలవుతుందన్నారు. కానీ నడిచే వ్యవస్థలో వాళ్లు భాగంగా లేరని పేర్కొన్నారు.
ఇదో అతి పెద్ద సాంకేతిక సమస్యగా మారిందని వాపోయారు.