ఎలోన్ మస్క్ కు మెలోనీ కితాబు
అమెరికా ఎన్నికల్లో నిబద్దత భేష్
ఇటలీ – ఇటలీ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమె తన చిరకాల స్నేహితుడిగా పేర్కొన్నారు టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో, స్పేస్ ఎక్స్ ఎండీ , ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్త ఎలోన్ మస్క్ గురించి.
ఇటీవలే గ్లోబల్ అవార్డు ప్రధానోత్సవంలో మెలోనీ, మస్క్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే మస్క్, మెలోనీ లు ఈ పుకార్లు నమ్మ వద్దని కోరారు. తాము డేటింగ్ లో లేమని స్పష్టం చేశారు.
తాజాగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించారు ఎలోన్ మస్క్. తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విస్తృతంగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇదే విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో. ఎలోన్ మస్క్ ఐ లవ్ హిమ్ అంటూ కొనియాడారు. ఆయన చేసిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
ఇదిలా ఉండగా ఎలోన్ మస్క్ నిబద్దత తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ. ఇటలీ, అమెరికా దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొల్పడంలో మస్క్ సాయం చేయగలరని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. మొత్తంగా మెలోనీ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.