NEWSTELANGANA

కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Share it with your family & friends

గ‌వ‌ర్న‌ర్ కు ఏసీబీ విన‌తిప‌త్రం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగానే సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ నెల రోజుల పాటు 144 సెక్ష‌న్ విధించారు. ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ముందు జాగ్ర‌త్త‌గా విధించిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఫార్ములా రేస్ తో ముడిపడి ఉన్న మొత్తం రూ.55 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారికంగా అభ్యర్థించింది.

ఆపరేషన్స్ (FEO) రేస్ ఈ సంవత్సరం ప్రారంభంలో షెడ్యూల్ చేశార‌రు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డు అనుమతులు, ఫైనాన్స్ క్లియరెన్స్‌లు , క్యాబినెట్ సమ్మతిని కూడా దాటవేసి, అవసరమైన అనుమతులు లేకుండా నిధుల బదిలీ చేసిన వ్య‌వ‌హారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మ‌రం చేసింది.

దీంతో కేటీఆర్ తో పాటు ఎంఏయుడీ మాజీ కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ తో స‌హా ఇత‌ర ఉన్న‌తాధికారుల‌పై కూడా కేసు న‌మోదు చేసేందుకు రంగం సిద్దం చేసింది ఏసీబీ.

తొమ్మిదో సీజన్‌లో భాగమైన ఫార్ములా ఇ రేసు హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జరిగింది. అయితే, చివరికి రేసు రద్దు చేయబడింది. దీన్ని అనుసరించి, ఎటువంటి కాంట్రాక్టు లేదా చట్టపరమైన మద్దతు లేకుండా నిధులు వెనక్కి తీసుకున్నారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

దీనిపై స్పందించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి “ఒక మంత్రి లేదా అధికారి ఇంత డబ్బు ఎలా బదిలీ చేస్తారు? ఎవరు లాభపడ్డారో మనం కనుక్కోవాలి,” అని అన్నారు.