పల్లెల బలోపేతం అభివృద్దికి సోపానం
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం
అమరావతి – పల్లె సీమలు పచ్చంగా ఉంటేనే మనందరం బాగుంటామని లేక పోతే నరకం తప్పదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట వేస్తుందని చెప్పారు. పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం చేయాల్సిందేనని అన్నారు డిప్యూటీ సీఎం. త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.750 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. వెదురు పెంపకం, బయో డీజిల్ మొక్కల పెంపకం ద్వారా పంచాయతీల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్.
ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటి సరఫరా లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పనులు చేపడతామన్నారు. పల్లె పండుగ పనుల నాణ్యతను సర్పంచులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇది మొండి ప్రభుత్వం కాదని, అందరి బాధలు వింటుందన్నారు. పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం నిర్వహిస్తామన్నారు.