టీటీడీ బోర్డు సభ్యులుగా ప్రమాణం
మరో ముగ్గురు ప్రమాణ స్వీకారం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సభ్యులుగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో భాను ప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు, సుచిత్ర ఎల్లా ఉన్నారు.
శ్రీవారి ఆలయంలోని స్వామి వారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు. కాగా ఇప్పటికే ఏపీ సర్కార్ మొత్తం 24 మంది సభ్యులను నియమించింది.
టీవీ5 ఛానల్ చైర్మన్, వ్యాపారవేత్త బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటికే 21 మంది చైర్మన్ తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు.
మరో ముగ్గురు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.