జగన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే – ఎమ్మెల్యే
నంద్యాల వరద రాజుల రెడ్డి కామెంట్స్
కడప జిల్లా – ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. ఆయనను జనం నమ్మడం లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడం, ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు వరద రాజుల రెడ్డి.
ఆయన చెప్పిన వాటిలో ఒక్క నిజం కూడా లేదన్నారు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం లోని గ్రామీణ ప్రాంతంలో 10 కోట్లతో సిసి రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేపట్టిన జగనన్న ఇళ్లల్లో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు ఎమ్మెల్యే.
భూమి ఎకరా 20 లక్షలకు కొని , 40 లక్షలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు మంజూరు చేయించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు . దోచు కోవడానికే భూములు కొనుగోలు చేశారని, పేదల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 35,000 వసూలు చేశారని ధ్వజమెత్తారు. బండారం బయట పడుతుందని ఎదురు దాడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు వరద రాజుల రెడ్డి.
ఇకనైనా జగన్ రెడ్డి మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.