NEWSTELANGANA

కేటీఆర్ అనుచ‌రుల అవినీతిపై ఆరా

Share it with your family & friends

నివేదిక ఇవ్వాల‌ని సీఎం ఆదేశం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సీన్ మారింది. కొత్త స‌ర్కార్ రావ‌డంతో గ‌తంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న ప‌దే ప‌దే అభివృద్ది పేరుతో తెలంగాణ‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు కొల్ల కొట్టార‌ని . దీనికి సంబంధించి ఒక్క‌టొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి.

తాజాగా హెచ్ఎండీఏలో మాజీ డైరెక్ట‌ర్ గా ఉన్న శివ బాల‌కృష్ణ పై ఏసీబీ చేసిన దాడుల్లో విస్తు పోయేలా కోట్లు, ఆభ‌ర‌ణాలు, విలువైన ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాలు బ‌య‌ట‌పడ్డాయి. ఈయ‌న మాజీ మంత్రి కేటీఆర్ , క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దొబ్బేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో మాజీ మంత్రి నిర్వ‌హించిన శాఖ‌లో అవినీతి చోటు చేసుకుంద‌ని స్ప‌ష్ట‌మైంది. కాంట్రాక్టుల పేరుతో అడ్డ‌గోలుగా దోపిడీకి పాల్ప‌డ్డారంటూ విమ‌ర్శ‌లున్నాయి. కేటీఆర్ చెప్పిన వారికే కాంట్రాక్టులు ద‌క్కాయ‌ని, మాజీ మంత్రి అనుచ‌రులే వీటిని చెప్పారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని, నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.