వెంకటేశ్..రానా..సురేష్ లపై కేసు
నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ సినీ నటులకు కోలుకోలేని షాక్ తగిలింది. నాంపల్లి కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అంతే కాకుండా కూల్చి వేతకు పాల్పడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోమవారం కోర్టులో బాధితుడు నంద కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ మేరకు బాధితుడి వైపు వాస్తవం ఉందని నమ్మిన ధర్మాసనం సీరియస్ అయ్యింది. వెంటనే నటులు ఎంతటి వారైనా సరే వారిపై కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లబో దిబోమంటున్నారు నటులు.
కోట్ల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేశారని, విలువైన ఫర్నీచర్ ఎత్తుకు వెళ్లారని ఆరోపించారు నందకుమార్. దీంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోలు వెంకటేశ్ , దగ్గుబాటి రానా, అభిరామ్ లతో పాటు నిర్మాత సురేష్ బాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ 448, 452, 380, 506, 120b సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.