SPORTS

సంజూ శాంస‌న్ సెన్సేష‌న్

Share it with your family & friends

టి20 ఫార్మాట్ లో 2వ సెంచ‌రీ

ద‌క్షిణాఫ్రికా – మ‌రోసారి కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌న స‌త్తా ఏమిటో రుచి చూపించాడు. ఇండియాలోనే కాదు బ‌య‌ట కూడా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. టి20 సీరీస్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన కీల‌క‌మైన సీరిస్ లో తొలి టి20 మ్యాచ్ లో దుమ్ము రేపాడు.

బంగ్లాదేశ్ తో హైద‌రాబాద్ లో జ‌రిగిన టి20 మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీతో క‌దం తొక్కితే ఇవాళ జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో సైతం రెచ్చి పోయాడు. స‌ఫారీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఓపెన‌ర్ గా రావ‌డం బ్యాటింగ్ ప‌రంగా సెట్ కావ‌డం శాంస‌న్ ఫ్యాన్స్ కే కాదు భార‌త అభిమానుల‌కు సంతోషం క‌లిగించింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో సంజూ 50 బంతులు ఆడి 107 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి. కింగ్స్ మీడ్ మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు కేర‌ళ స్టార్. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు.

ఫోర్లు సిక్స‌ర్ల‌తో రెచ్చి పోవ‌డంతో స‌ఫారీ బౌల‌ర్లు నేల చూపులు చూశారు. అద్భుత‌మైన సెంచ‌రీ సాధించిన సంజూ శాంస‌న్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. మ్యాచ్ అనంత‌రం ద‌క్షిఫ్రికా జ‌ట్టు కెప్టెన్ శాంస‌న్ ఆట తీరును మెచ్చుకున్నాడు. అద్భుతంగా ఆడాడంటూ కితాబు ఇచ్చాడు.

క్లాసెన్ గ‌నుక క్రీజులో ఉంటే సీన్ వేరేగా ఉండేద‌న్నాడు స్కిప్ప‌ర్. ఇదిలా ఉండ‌గా భార‌త క్రికెట్ త‌ర‌పున టి20 పార్మాట్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేయ‌డం ఓ రికార్డ్ .