సంజూ శాంసన్ రికార్డ్ బ్రేక్
టి20 ఫార్మాట్ లో 2వ సెంచరీ
డర్బన్ – కేరళ స్టార్ సంజూ శాంసన్ దుమ్ము రేపాడు. టి20 ఫార్మాట్ లో అరుదైన ఘనతను సాధించాడు. తనకు ఎదురే లేదని చాటాడు. ఇటీవలే హైదరాబాద్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో సూపర్ సెంచరీ సాధించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతులు ఆడిన సంజూ శాంసన్ ఏకంగా 107 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్సర్లు కొట్టాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైదానం నలు వైపులా కళ్లు చెదిరే షాట్స్ ఆడాడు సంజూ శాంసన్ .
భారత దేశం తరపున టి20 క్రికెట్ ఫార్మాట్ లో వరుసగా రెండు సెంచరీలు చేయడం విశేషం. శాంసన్ ఒక్కడే రికార్డ్ సృష్టించాడు. ఏకైక వికెట్ కీపర్ కూడా శాంసన్ ఒక్కడే కావడం. మరో వైపు భారత జట్టు కూడా క్యాలెండర్ సంవత్సరంలో 200 పరుగులను ఏడుసార్లు చేయడం ఇది రెండోసారి కావడం విచిత్రం.
ఇక ప్రపంచ వ్యాప్తంగా టి20 ఫార్మాట్ లో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సంజూ శాంసన్ నాలుగో క్రికెటర్ . అంతకు ముందు గుస్తవ్ మెక్ కియోన్, రిలీ రూసో, ఫిల్ సాల్ట్ ఉన్నారు.
ఇదిలా ఉండగా మ్యాచ్ అయి పోయాక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరు ఆటగాళ్లు 90 రన్స్ ఉన్న సమయంలో తడబడతారు. తాము సెంచరీ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ సంజూ శాంసన్ అలా కాదన్నాడు. అతడు ముందు జట్టు గురించి ఆలోచిస్తాడని కితాబు ఇచ్చాడు.