NEWSANDHRA PRADESH

టీడీపీ..జ‌న‌సేన గెలుపు ఆప‌లేరు

Share it with your family & friends

ధీమా వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు

ప‌త్తికొండ – తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ కూట‌మి విజ‌యాన్ని ఎవ‌రూ ఆప లేర‌ని అన్నారు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు. ప‌త్తికొండ‌లో సోమ‌వారం జ‌రిగిన రా క‌ద‌లిరా స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా వైసీపీ స‌ర్కార్ ను, ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు.

రాష్ట్రంలో వైకాపాకు చెందిన ఓట్ల దొంగ‌లు ప‌డ్డారంటూ మండిప‌డ్డారు. ఎన్ని కుట్ర‌ల చేసినా , వ్యూహాలు ప‌న్నినా చివ‌ర‌కు గెలిచేది తామేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

వైసీపీ వాపు చూసి బ‌లుపు అనుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మైన‌వ‌ని, అవినీతికి, నీతికి , ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య యుద్దం జ‌ర‌గ బోతోంద‌ని అన్నారు. ఆరు నూరైనా స‌రే ఏపీలో తానే సీఎం అవుతాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. మ‌న గెలుపు ఖాయ‌మై పోయింద‌ని, ఇక ప్ర‌మాణ స్వీకారం చేయ‌డ‌మే మిగిలి ఉంద‌న్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.