శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ
దీపాలంకర సేవ రద్దు
తిరుమల – తిరుమలలో శ్రీవారి వార్షిక పుష్ప యాగానికి అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది.
శనివారం పుష్పయాగాన్ని పురస్కరించుకొని ముందు రోజున వసంత మండపంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీవో శ్రీ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా తిరుమల లోని శ్రీవారికి పుష్ప యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. టీటీడీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. తాజాగా టీటీడీ చైర్మన్ తో పాటు సభ్యులు కొలువు తీరారు.