హెచ్ సీ ఏకు రూ. 4 కోట్ల ఆదాయం
టెస్టు మ్యాచ్ ల నిర్వహణలో రికార్డ్
హైదరాబాద్ – రాను రాను టెస్టు క్రికెట్ కు ఆదరణ తగ్గి పోతోందని ఆందోళన చెందుతున్న సమయంలో ఉన్నట్టుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ర ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కు ఊహించని రీతిలో ఆదరణ లభించింది. ఈ మ్యాచ్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సదరు సంస్థకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదాయపు బాట పట్టింది.
ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ను ఘనంగా నిర్వహించి ఔరా అనిపించింది. దీంతో బీసీసీఐ కూడా సంతోషం వ్యక్తం చేసింది నిర్వహణ పట్ల. హైదరాబాద్ అంటే చాయ్ ..బిర్యానీ ..క్రికెట్ అంటూ పేర్కొన్నారు చీఫ్.
ఇదిలా ఉండగా విద్యార్థులకు 25 వేల మందికి ఉచితంగా పాసులు కూడా ఇచ్చారు. ఆపై భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్ పరంగా చూస్తే తొలి రోజు 25,000 వేల మంది, 2వ రోజు 32,000, 3వ రోజు 31,000, 4వ రోజు 30, 0000 వేల మంది వీక్షించారని తెలిపారు జగన్ మోహన్ రావు. మొత్తంగా ఈ మ్యాచ్ ను లక్షకు పైగా చూశారని , టికెట్ల ద్వారా రూ. 4 . 25 కోట్లు వచ్చాయని స్పష్టం చేశారు.