ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ
59 కార్పొరేషన్ చైర్మన్లు..డైరెక్టర్ల పోస్టులు
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శనివారం కీలకమైన కార్పొరేషన్లకు సంబంధించి రెండవ జాబితా విడుదల చేసింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మహమ్మద్ షరీఫ్ కు మైనార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. స్టూడెంట్స్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ క్యాబినెట్ ర్యాంక్ హోదాలో చాగంటి కోటేశ్వర్ రావుకు ప్రభుత్వ సలహాదారుడిగా ఛాన్స్ ఇచ్చింది.
ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడిపూడి సత్తిబాబు, ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా మాల సురేంద్ర, ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రోనంకి కృష్ణం నాయుడు , ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా వీణ కుమార్ ను నియమించింది.
వీరితో పాటు ఏపీ కురుబ, కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా దేవేంద్రప్ప , ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా ఆర్ సదాశివ , ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా సావిత్రి , ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పాలవలస యశస్వి ను కూటమి సర్కార్ నియమించింది.
ఏపీ వాల్మీకి , బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా కపట్రాల సుశీలమ్మ , ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా – సి ఆర్ రాజన్ , ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా నరసింహ యాదవ్ , ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిలకలపూడి పాపారావు ను నియమించింది.
ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ గా వీరంకి వెంకట గురుమూర్తి , ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గండి బాబ్జి , ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ చైర్ పర్సన్ గా మంజులా రెడ్డి రెంటిచింతల , ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు చైర్మన్ గా నీలాయపాలెం విజయకుమార్ , ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవి రెడ్డికి అవకాశం కల్పించింది కూటమి సర్కార్.
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ గా మన్నవ మోహన్ కృష్ణ , ఏపీ కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్ గా తేజ్జస్వి పొడపాటి , ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా పొలంరెడ్డి దినేష్ రెడ్డి , ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుజయ్ కృష్ణ రంగారావు , ఏపీ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గా గోనుగుంట్ల కోటేశ్వర రావు , ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ ను నియమించింది.
ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ గా కేకే చౌదరి, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిల్లపల్లి శ్రీనివాస రావు , ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రగడ నాగేశ్వర రావు , ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ గా మరెడ్డి శ్రీనివాస రెడ్డి ,
ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా ఆనం వెంకట రమణా రెడ్డిని నియమించింది.
ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా రఘురామ రాజు గొట్టిముక్కల, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ చైర్మన్ గా సావల దేవదత్ , ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రావి వెంకటేశ్వర రావు, ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావలి గ్రీష్మ , ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టిడిపి ( కడప జోన్ ) లను నియమించింది ప్రభుత్వం.
ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ గా సజ్జా హేమలత, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాల కృష్ణ , . ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గా సీతారామ సుధాకర్ , స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభి రామ్, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా స్వామినాయుడు ఆలాడ, అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా టిసి . వరుణ్ ను నియమించింది.
అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా రూపానంద రెడ్డి , బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా సలగల రాజశేఖర్ బాబు , బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా తెంటు లక్ష్మి నాయుడు , చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్ పర్్సన్ గా కే. హేమలత , కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామికి అవకాశం కల్పించింది సర్కార్.
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు , మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా మట్టా ప్రసాద్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా బోడ్డు వెంకటరమణ చౌదరి , శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా కోరికన రవికుమార్ , విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా ప్రణవ్ గోపాల్ ను నియమించారు.
ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ముస్తాక్ అహ్మద్ , ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డి. రాకేష్ , ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) , ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా ఉండవల్లి శ్రీదేవి, ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ , ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా కిడారి శ్రావణ్ ను సర్కార్ నియమించింది.