షర్మిల పనితీరు సూపర్
మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు
కడప జిల్లా – మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దివంగత వైఎస్సార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం పల్లంరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలలో అరుదైన మహా నాయకుడని కొనియాడారు. ఇదే సమయంలో ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్న ఏకైక వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆమె చిరుత పులిలా కదులుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే పనిలో పడ్డారని, అందుకే జనం ఆమెను ఆదరిస్తున్నారని అన్నారు పల్లంరాజు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు.
పట్టుదలతో విరామం అన్నది లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారంటూ కొనియాడారు పల్లంరాజు వైఎస్ షర్మిలా రెడ్డిని. ఈసారి ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కీలకమైన భూమిక పోషించడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఏపీని ముక్కలు చేసే పనిలో ఉన్నారని, ఇప్పటికే కేంద్రం చేతిలో చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.