భావోద్వేగానికి లోనైన సీజేఐ చంద్రచూడ్
వీడ్కోలు సందర్బంగా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీ కాలం ముగియడంతో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ప్రసంగించారు. తన జీవిత కాలంలో మరిచి పోలేనని పేర్కొన్నారు. భారత దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తండ్రీ కొడుకులు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్బంగా తన తండ్రిని గుర్తు చేసుకోకుండా ఉండలేనని అన్నారు.
సీజేఐగా కీలకమైన తీర్పులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. ఇదే సమయంలో తన గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. బహుశా తాను అత్యంత ట్రోల్ చేయబడిన న్యాయమూర్తులలో ఒకడిని అన్నారు. సోమవారం నుంచి ఇంకా ఈ ట్రోల్స్ ఎక్కువ అవుతాయని తాను అనుకుంటున్నట్లు చెప్పారు సీజేఐ డీవై చంద్రచూడ్.
తాను కోర్టులో ఎవరినైనా బాధ పెట్టినట్లయితే దయచేసి మన్నించాలని కోరారు. నవంబర్ 9, 2022లో సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కీలకమైన ఎలక్షన్ బాండ్ పై తీర్పు చెప్పారు. ఒకానొక సమయంలో ఆయన కేంద్ర సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టారు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం రద్దు చేయడం, ఎలక్టోరల్ బాండ్ల కేసుతో సహా అనేక మైలురాయి తీర్పులను ఆయన గుర్తు చేసుకున్నారు. నా విధులు ఏమిటో తెలుసు. పీఎంకు తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు జస్టిస్ చంద్రచూడ్. వ్యక్తిగత ఎజెండాలతో ఆయా పదవులలో లేమని పేర్కొన్నారు.