మహిళల రక్షణకు సర్కార్ పెద్దపీట
మాజీ మంత్రి పీతల సుజాత కామెంట్
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉందన్నారు మాజీ మంత్రి పీతల సుజాత. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు.
మహిళల వ్యక్తిత్వం హననం చేస్తూ వల్గర్ పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైసీపీ పాపాల పుట్ట బద్దలైందన్నారు. ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తోందన్నారు. చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టాడని అన్నారు. వర్రా రవీంద్ర రెడ్డి వైసీపీ సైకో. ఇలాంటివారు ఇంకా చాలా మంది ఉన్నారని మండిపడ్డారు. . వర్రా వెనుక ఎవరున్నారో తెలియాలని అన్నారు.
అతడికి శాలరీ ఎక్కడి నుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తామని ప్రకటించారు పీతల సుజాత. తప్పక విచారణ జరిపిస్తామన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న పెద్ద పెద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదని అన్నారు .
జగన్ పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాల సంఖ్య 25 శాతానికి తగ్గాయని చెప్పారు. రాబోయే రోజుల్లో నేరాల సంఖ్య తగ్గించడమే చంద్రబాబు లక్ష్యం అని స్పష్టం చేశారు.