ముగిసిన సీజేఐ పదవీ కాలం
ఇక సెలవు అన్న చంద్రచూడ్
హైదరాబాద్ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు లో ప్రధాన న్యాయమూర్తిగా కొలువు తీరిన జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీ శనివారం నాటితో తన పదవీ కాలం ముగిసింది. ఈ సందర్బంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరు పొందిన భారత దేశానికి తను న్యాయ పరంగా ప్రాతినిధ్యం వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గత నవంబర్ 9, 2022లో సీజేఐగా కొలువు తీరారు జస్టిస్ డీవై ఎన్ చంద్రచూడ్. ముక్కుసూటి మనస్తత్వానికి ఆయన పెట్టింది పేరు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. ఈ సందర్బంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ కు గురయ్యారు. ఇదే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు సీజేఐ డీవై ఎన్ చంద్రచూడ్.
తన పదవీ కాలంలో మైలు రాళ్లు ఉన్నాయి. అంతకు మించి విమర్శలు కూడా ఉన్నాయి. 500 ఏళ్లుగా నిరీక్షించిన ఆర్టికల్ 370కి ముగింపు పలికారు. రామ మందిరంపై చరిత్రాత్మక తీర్పు వెలువరించారు. ఇదే సమయంలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ కు కంట్లో నలుసుగా మారారు. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఎలక్టోరల్ బాండ్ లకు వ్యతిరేకంగా సంచలన తీర్పు వెలువరించారు. కానీ గణేష్ పండుగ సమయంలో మోడీ సీజేఐ ఇంటికి వెళ్లడం, దీపారాధన చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.