మహిళల..చిన్నారుల భద్రతపై ఫోకస్
ఏపీ హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి
అమరావతి – మహిళలు..చిన్నారుల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సమీక్ష నిర్వహించారు.
మహిళలు, చిన్నారుల భద్రత, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియాలో అశ్లీల, అసభ్య పోస్టుల నియంత్రణపై డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే పోస్టుల విషయంలో ఉపేక్షించ వద్దని అన్నారు . ఈ మధ్య సోషల్ మీడియాను దుర్వినియోగానికి, దుష్ప్రచారానికి ఎక్కువగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే పోలీసుల భర్తీ జరుగుతుందన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రకటించారు వంగలపూడి అనిత.
వైసీపీ నాయకులకు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. తప్పు చేసినవారు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే బయటికి తెస్తామని అన్నారు . వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు వైసీపీ ప్రభత్వంలో విచ్చలవిడిగా వదిలిన గంజాయి, డ్రగ్సే కారణం. ఈ పాపం వైసీపీదేనని స్పష్టం చేశారు హొం శాఖ మంత్రి.